ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఆకాంక్ష డెస్క్ : ప్రజలకు వ్యతిరేకంగా... ప్రజా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ... ప్రజల పక్షాన గొంతే ఎత్తితే వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు.ఏసీబీ కేసుల పేరుతో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇలాంటి ఎన్ని కేసులు పెట్టిన భయపడేదే లేదన్నారు.ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. 12 వేలకు తగ్గించి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని అన్నారు. అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు భయపడిన ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తుందని ఆరోపించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత జైనూరు బాధితురాలి నివాసానికి వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.బాధితురాలికి ఆర్థిక సహాయం అందించారు.బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Admin
Aakanksha News