ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం కమీషనరేట్ పరిధిలోని ఓ ఎస్సై కిరణా షాపు నిర్వాహకుడిని చితక బాదాడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... గోదావరిఖని సీతనగర్ కూరగాయల మార్కెట్ వద్ద అర్థరాత్రి వరకు షాపును తీశారని సదురు షాప్ నిర్వాహకుడిని ఓ ఎస్ఐ తన లాఠీతో చితకబాదారు. దీంతో షాపు నిర్వాహకుడి చేయి విరిగింది. అయితే అక్కడే ఉన్న స్థానికులు సదరు ఎస్సైకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఎలా చితక బాధరంటు నిలదీశారు.అయితే గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఉన్న ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రతిరోజు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు నడుస్తున్న దీనిపై సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడం పట్ల ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న చితక షాపుల మీద ప్రభావం చూపించే అధికారులు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొంతమంది షాపు నిర్వాహకులకు తోత్తుల వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Admin
Aakanksha News