ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : గత 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని, 6 గ్యారెంటీ హామీలలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్య భూమికను పోషించడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేరుస్తూ ప్రజా ప్రభుత్వంగా పనిచేస్తున్నందులకు ధన్యవాదములు. అదే విధంగా తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అద్యక్షుల్లు డాక్టర్ చిమ శ్రీనివాస్ విజ్ఞప్తి చేసింది.ఈ మేరకు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాస్దినట్లు డాక్టర్ చిమ శ్రీనివాస్ తిలిపారు. ee సందర్బంగా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేర్సిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, గుర్తింపు కార్డులు జారీ చేయాలి. సంక్షేమ పథకాలలో, ఇందిరమ్మ ఇండ్లలో రాజీవ్ యువ వికాసంలలో 20% కోటా ఉద్యమకారులకు కేటాయించాలి. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి 10 వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలి తెలంగాణ సాంస్కృతిక విభాగంలో వెయ్యి ఉద్యోగాలు కల్పించి తెలంగాణ ఉద్యమ కళాకారులకి కేటాయించాలి.*తెలంగాణ ఉద్యమ నమస్కారాలతో... ఇటి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సురేందర్ రెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు దయానంద్, కొండ స్వామి, గగన్ కుమార్, వీరాస్వామి, కొంతం యాది రెడ్డి, జగన్ యాదవ్, సుదర్శన్ రావు, ఆర్కే భూపాల్, సుదర్శన్, శివ కుమార్ నేత, విష్ణువర్ధన్, శ్యామల, ప్రభు గుప్తా, రామ్ బాబు, నరేందర్ గౌడ్, చంద్ర శేఖర్, లక్ష్మణ్, గౌస్, పోచయ్య* తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News