Friday, 31 July 2026 10:32:13 PM

RFCL యాజమాన్యం కార్మిక సమస్యలపై కార్మిక సంఘాలతో చర్చించాలి.

IFTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం డిమాండ్

Date : 12 February 2023 01:05 PM Views : 638

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : IFTU అనుబంధ RFCL కమిటీ సమావేశాన్ని గోదావరిఖనిలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా IFTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సూర్యం హాజరై మాట్లాడుతూ.. RFCL లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారని పేర్కొన్నారు. FCI మాజీ కాంట్రాక్టు కార్మికులకు మొదట ప్రాధాన్యత ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. RFCL లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు లేక, సరైన సమయంలో వేతనాలు రాక, ఎలాంటి చట్టబద్ధహక్కులు కూడా అమలు కాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని అన్నారు. కార్మిక సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చే అవకాశం కూడా కార్మిక సంఘాలకు యాజమాన్యం ఇవ్వడం లేదని. చట్టబద్ధంగా వ్యవహరిస్తున్న కార్మిక సంఘాలకు కార్మిక సమస్యలపై చర్చించే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.అలాగే లోడింగ్ అన్ లోడింగ్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు అత్యంత వెట్టిచాకిరీకి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి శ్రమకు తగ్గ వేతనాలు అందాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతే కాకుండా ఉత్పత్తి మీదనే శ్రద్ధ వహిస్తున్న యాజమాన్యం కార్మిక సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఉత్పత్తి, సంక్షేమము, రక్షణ ఈ మూడు బాగున్నప్పుడే పరిశ్రమ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ దిశగా ఆర్ ఎఫ్ సి ఎల్ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని, ఆర్ ఎఫ్ సి ఎల్లో రాజకీయాలకు తావు లేకుండా కార్మిక చట్టాలకు లోబడి పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం కార్మిక సంఘాలకు యాజమాన్యంతో చర్చించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏమాత్రం, ఎక్కడ అవకాశం ఉన్నా గత ఎఫ్ సి ఐ మాజీ కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో జి సత్యనారాయణ రెడ్డి ఇనగాల రాజేశ్వర్, తోకల రమేష్, ఎండి చాంద్ భాషా, యు వెంకటేష్, రాయమల్లు, మొగిలి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :