Saturday, 01 August 2026 01:22:17 AM

హుస్నాబాద్‌లో వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించండి...

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని కోరిన మంత్రి పొన్నం

Date : 16 January 2024 07:54 PM Views : 485

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కరీంనగర్ జిల్లా : హుస్నాబాద్‌లో వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం తిరుపతిలో తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మంత్రి పొన్నంను సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ ప్రజల అభీష్టం మేరకు, హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని టీటీడీని కోరినట్లు తెలిపారు. ఆలయానికి సరిపడా స్థలాన్ని కూడా సమకూరుస్తామని మంత్రి టీటీడీ చైర్మన్‌కు చెప్పారు. స్వామి వారి కృపా, కటాక్షాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉండాలని కోరుకున్నట్లు మంత్రి పొన్నం చెప్పారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :