ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు మోడల్ హౌస్ ప్రతి మండల కేంద్రంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. పేదల పాలిట వరంగా రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచిస్తుందని ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలని ఆయన నియోజక వర్గ ప్రజలందరినీ కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు మార్కెట్ చైర్మన్ అంతటి. రజిత మల్లేష్, మున్సిపల్ చైర్మన్, గార్లపాటి. శ్రీనివాసులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తది తరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News