Thursday, 30 July 2026 01:41:12 PM

కేసీఆర్ పాలనలో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పటిష్ఠంగా మారింది...

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Date : 25 April 2023 09:26 PM Views : 536

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కేసీఆర్ పాలనలో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పటిష్ఠంగా మారిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు గోషామహల్ లో బీఆర్ఎస్ నేత నందకిషోర్ వ్యాస్ బిలాల్ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు...రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అన్ని పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. అలాగే బడుగు బలహీన వర్గాలకు అన్ని పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ పార్టీ ప్రజలకు నమ్మకాన్ని కలిగించిందని అన్నారు.గోషామహల్ నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిందని.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇక్కడి ప్రజలకు చేసిందేమి లేదని విమర్శించారు. గోషామహల్ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. ప్రస్తుతం ఎలాంటి అల్లర్లు లేకుండా బేగంబజార్ లో ఎంతో మంది ప్రజలు సంతోషంగా వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. కుల,మతాల రెచ్చగొట్టి.. ప్రజలను విడగొట్టడమే అమిత్ షా టార్గెట్ అని మండిపడ్డారు.మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్న వారికి.. ప్రజల అవసరాలు, సమస్యలు పట్టవని విమర్శించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :