ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : టికెట్ ఆశించిన ఓ మహిళా నాయకురాలిని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అనుచరులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడంతో పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో రామగుండం ఎమ్మెల్యే పేరు మరోసారి వివాదాస్పదమవుతుంది. కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు అమ్ముడు పోయావా.. అంటూ సోషల్ మీడియాలో వాక్యాలు చేయడం వివాదాస్పదంగా మారుతుంది. మహిళ నాయకురాలు ఎదుగుదలను చూడలేకే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ఈ పోస్టులపై పాలకుర్తి జడ్పిటిసి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి పోటీలో ఉండటం తప్ప అని ప్రశ్నించారు.
Admin
Aakanksha News