ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణ కేంద్రంలో RBHV స్కూల్, CV RAMAN డిగ్రీ కళాశాల, నస్పూర్ లోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లలో ఏర్పాటు చేసిన గ్రూప్-3 పరీక్షా కేంద్రాలను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి డీసీపీ భాస్కర్ పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి, పరీక్ష అనంతరం ఎగ్జామ్స్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ తరలింపు గురించి పోలీస్ అధికారులకు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద (144 సెక్షన్) 163 BNSS అమల్లో ఉన్నందున 500 మీటర్ల లోపు ఎవరు కూడా గుమి కూడా వద్దని సూచించారు.
Admin
Aakanksha News