Thursday, 30 July 2026 08:53:17 PM

సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..?

ఆసరా, రైతు భరోసా అమలుకు సన్నద్ధ మవుతున్న రాష్ట్ర ప్రభుత్వం

Date : 22 November 2024 05:07 PM Views : 447

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రైతు భరోసా, ఆసరా పింఛన్ల పెంపు అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ రెండు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటిని పెంచకపోవడంతో వృద్ధులు, మహిళలు, రైతులు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.వచ్చే నెల రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి? అనే అంశంపై చర్చించనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులు, రైతు సంఘాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది.రైతు భరోసా విధివిధానాలు ప్రకటించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ నెల చివరి వరకు ఇంటింటి సర్వే కూడా ముగియనున్నది. బిసి జనాభా ఎంత మేరకు ఉన్నది అన్న దానిపై క్లారిటీ రానున్నది. సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావొచ్చని తెలుస్తోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :