ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే.. బాలాజీనగర్ మార్కెట్ లేన్‌లో నివాసం ఉండే కాటి నర్సింహా వృత్తిరీత్యా కూలి పని చేసుకుంటూ భార్య సుమలత, ఇద్దరు కుమారులతో జీవనం సాగిస్తున్నాడు. అయితే సుమలత తల్లి తన కూతురి పిల్లలను చూసేందుకు ఇంటికి వచ్చిన క్రమంలో సమీపంలో ఉండే నర్సింహ సోదరుడు సాయి ఇంటికి వెళ్లగా అక్కడ అందరు మాట్లాడుకుంటున్న క్రమంలో బన్నీ అనే నాలుగు సంవత్సరాల బాలుడు వేడి నీటి బకెట్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. దీంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీశారు. అప్పటికే ఛాతీ భాగం తీవ్రంగా కాలిపోవడంతో చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Aakanksha News