Friday, 31 July 2026 03:40:55 PM

బిగ్ బ్రేకింగ్.. అమరణ దీక్ష విరమించిన కేఏ పాల్

నిమ్మరసం తాగించి దీక్ష విరమణ చేపించిన గద్దర్

Date : 05 October 2022 03:17 PM Views : 498

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా నిరంకుశంగా ఊరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరికి నిరసనగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి వరకు దీక్ష విరమింప చేసేది లేదని ప్రకటించారు. అయితే కెసిఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మునుగోడు లో తన అభ్యర్థిని నిలబెట్టి పోటీలో నిలబెడతానని కేఏ పాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అన్వార్యమైంది. దీంతో కసరత్తు ప్రారంభించిన కే ఏ పాల్ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. ప్రజా గాయకుడు గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరడంతో ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మునుగోడు అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో పాటు రేపటినుండి గద్దర్ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. అయితే ప్రజా సమస్యలపై పాటలు పాడుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలను ఎండగాడుతూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ వస్తున్న గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతో మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీల నాయకులకు ఆసక్తి నెలకొల్పుతుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :