ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రాజన్న సిరిసిల్ల జిల్లా : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ మాయం కావడంతో అక్కడి స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు ఖంగుతిన్నారు. బీఆర్ఎస్ నేతలు తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ నిమిషాల్లో మాయం కావడంతో అక్కడ ఏం జరిగిందో అర్థం కాక ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోవడంతో అక్కడ స్థానికంగా ముక్కున వేలేసుకునెలా చేసింది. వివరాల్లోకి వెళ్తే...రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంత మంది నాయకులు తెలంగాణ చౌక్ వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని తీర దిష్టిబొమ్మ దహనం చేసే సమయానికి దిష్టిబొమ్మను గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఎత్తుకెళ్లారు. దీంతో బిఆర్ఎస్ నేతలంతా బిత్తరపోయి చూశారు. మరల ఓ దిష్టిబొమ్మను తయారుచేసి కార్యక్రమం ప్రారంభించారు. దీంతో స్థానికంగా కొంత సేపు అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి.
Admin
Aakanksha News