Thursday, 30 July 2026 03:22:15 PM

తెలంగాణ ఎంఎల్ఏల అనర్హత పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పు..

తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు

Date : 22 November 2024 05:09 PM Views : 590

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ఎంఎల్ఏల అనర్హత పిటిషన్ పై కీలక తీర్పు వెలువరించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని, ఆ అర్హత స్పీకర్ కే ఉందని సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. అయితే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బిఆర్ఎస్ ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలనే వ్యాజ్యాలపై సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి. నర్సింహాచార్యులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపి తీర్పు వెలువరించింది.ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :