Thursday, 30 July 2026 12:03:41 PM

మత్తు పదార్థాలు సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దు....

గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకై అవగాహన సదస్సు..ఏసీపీ తుల శ్రీనివాస్ రావు

Date : 06 January 2024 07:54 PM Views : 712

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనకై గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ తుల శ్రీనివాస్ రావు హాజరైయ్యారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో యువకులు కార్మికులు గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. మత్తు పదార్థాలు సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దని గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించిన క్రమంలో నేరాలు ప్రవృత్తి పెరుగుతుందని ఏసీపీ తెలిపారు. ఎవరైనా నిషేధిత గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్మడం, కొనడం, కలిగి ఉండడం కానీ సరఫరా చేయడం చేసిన వారి మీద నిఘా పెట్టి వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకుంటూ పీడియాక్ట్ లు నమోదు చేస్తామని ఏసీపీ తుల శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని పట్టణ ఇన్స్పెక్టర్ S.ప్రమోద్ రావు, ప్రసాద్ రావు, ఎస్ఐ సుగుణాకర్ పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :