Friday, 31 July 2026 08:30:13 PM

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం చేయడంపై కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగ్రహం

Date : 12 July 2023 06:53 PM Views : 850

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా మల్యాల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నేతలు పిండ ప్రదానం చేయడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మల్యాల క్రాస్ రోడ్డు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు చేసిన పిండ ప్రధానం స్థలాన్ని నీటితో శుద్ధి చేసి అక్కడే రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ దారం ఆదిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బూటకపు మాటలను రైతులు నమ్మవద్దని పిలుపునిచ్చారు. రైతుల కష్టాలు చూసి ఉచిత 24 గంటల విద్యుత్ ప్రవేశపెట్టింది దివంగత వైయస్సార్ అని అన్నారు. ఉచిత విద్యుత్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దోపిడిని బయట పెడుతున్న రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలను చేస్తూన్నారని పేర్కొన్నారు. బూటకపు కార్యక్రమాలను రైతులు నమ్మరని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు దొంగ ఆనందరెడ్డి, నాయకులు వెల్మ లక్ష్మారెడ్డి, మారంపల్లి గంగాధర్, కంచెర్ల లక్ష్మణాచారీ, ఎండీ ఇమామ్, బక్కశెట్టి శ్రీనివాస్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :