Friday, 31 July 2026 04:35:27 PM

గురుకుల పాఠశాలో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు...

బిసి సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్

Date : 26 February 2024 09:22 PM Views : 534

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : విద్యార్థులకు సరిపోను బాత్రూములు, తరగతి గదులు,విశ్రాంతి గదులు లేకపోవడం వల్ల విద్యార్థులు అవస్థలు పడుతున్నారని బిసి సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ తెలిపారు.గంగాపూర్ రహదారి లో మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలని ఆయన సోమవారం సందర్శించిన లో విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ 480 మంది ఆరు మంది విద్యార్థులు ఉండవలసిన రూములో 20 మందికి పైగా ఉండటం వల్ల వాళ్ల బ్యాగులు పెట్టుకోవడానికి కూడా స్థలం సరిపోక తరగతి గదిలలో నిద్రొస్తున్నారని డైనింగ్ హాలు కూడా ఇరుకుగా ఉందని , హాస్టల్ రూముల స్లాబ్ పై పెచ్చులు ఊడిపోయి ప్రమాదకరంగా మారాయని, కిటికీలు కూడా లేవని విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే జవాబుదారీ ఎవరని ఆవేదన వ్యక్తం చేశారు .సంబంధిత అధికారులు స్థానిక శాసనసభ్యులు తక్షణమే గురుకుల పాఠశాలను సందర్శించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమం లో బీసీసేన జిల్లా నాయకులు కు ర్వగడ్డపల్లి గోపాల్, మండల ప్రధాన కార్యదర్శి గొడుగు నరసింహులు, నియోజవర్గం కార్యదర్శి రామస్వామిలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :