Thursday, 30 July 2026 02:34:29 PM

ఎస్సీ మహిళా హాస్టల్ ను వెంటనే నిర్మించాలి

ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో ధర్నా

Date : 20 March 2023 02:06 PM Views : 657

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని పాత మున్సిపల్ ఆఫీసు వెనకాల ఉన్న ఎస్సీ మహిళ హాస్టల్ ముందు NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బైరిమల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ..ఎస్సీ మహిళ హాస్టల్ ను కూల్చి వేసి నిర్మాణం చేస్తామని మాట ఇచ్చి ఎలాంటి నిర్మాణ పనులు గాని చర్యలు కానీ మొదలు పెట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులలో ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా నిర్మాణ పనులు మొదలు పెట్టక పోయినా అక్కడే దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలోఅరుకల విక్రమ్, గడ్డం సతీష్ , కార్తీక్ ,సిద్దు వెంకటేష్, తదితర NSUI నాయకులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :