Saturday, 13 June 2026 02:37:41 PM

ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌..

ఏడుగురు మావోయిస్టులు హతం

Date : 04 October 2024 07:03 PM Views : 400

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఆకాంక్ష డెస్క్ : ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. నారాయణ్‌పూర్‌ – దంతెవాడ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.బస్తర్‌ రేంజ్‌లోని దంతెవాడ, నారాయణ్‌పూర్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మడ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కి ఉన్నట్లు పోలీసులకు ముందుగా సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలను చూసిన మావోలు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది ఎదురుకాల్పులకు దిగి.. ఏడుగురు మావోలను మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :