Thursday, 30 July 2026 10:08:29 AM

మెడికల్ &హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రమోషన్ కల్పించండి...

డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. త్రివేణికి తెలంగాణ ఉద్యోగుల సంఘం వినతి పత్రం

Date : 16 February 2024 05:52 PM Views : 452

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మెడికల్ &హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రమోషన్ కల్పించాలని కోరుతూ డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. త్రివేణికి తెలంగాణ ఉద్యోగుల సంఘం వినతి పత్రం సమర్పించింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్.రవీందర్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ &హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు గతంలో ఒక సంవత్సరం పాటు ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ మరియు లాబ్ టెక్నీషియన్ ట్రైనింగ్ చేయడం వలన ఒక ప్రమోషన్ పొందే అర్హత వస్తుందని,ఇట్టి విషయమై మెడికల్ సెక్రటరీని కోరినట్లు తెలిపారు .ప్రభత్వం Govt. Memo. No.7711/G/2024-1, Dt 10.02.2024 ద్వారా డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తగిన చర్యలు తీసుకోవాలని మ్కోరినట్లు తెలిపారు.అలాగే ట్రైనింగ్ కు సంబందించిన విషయం కుడా చర్చించడం జరిగిందాని తిలిపారు.తమ విన్నపం పై డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.. ఈ కార్యక్రమం లో రాష్ట్ర అధ్యక్షులు ఎమ్.రవీందర్ కుమార్, నగర శాఖ అధ్యక్షులు ఎన్. నర్సింగరావు మరియు ఐపిఎం రాష్ట్ర అధ్యక్షులు జి మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి, ఉపాధ్యక్షులు కొండా అరవింద్ కుమార్, మహమ్మద్ గౌస్ పాషా, కార్యదర్శి శ్రీనివాస్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :