ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హన్మకొండ జిల్లా : గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయుటకు మీ అందరి సహకారం అవసరమని ఎస్సై రమేష్ అన్నారు.మండలంలోని వజినేపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులతో సమావేశాన్ని ప్రాథమిక పాఠశాల వద్ద ఏర్పాటు చేశారు. ఎస్సై రమేష్ గ్రామస్థులతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్న స్థితిగతులను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మీ గ్రామంలో సీసీ కెమెరాలు ఉంటే మా పోలీసు సిబ్బంది మీ గ్రామంలో ఉన్నట్టేనని అన్నారు. మీ గ్రామానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఒక సీసీ కెమెరా 100 మందిని చూస్తుందని వారు ఏం చేసినా కూడా మనకు కనబడుతుంది అని తెలిపారు. మీ గ్రామంలో గొడవలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు రాత్రి సమయంలో తిరగకుండా కొత్త వ్యక్తులు రాకుండా మీ గ్రామంలో మంచి వాతావరణం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కిరణం షాపు యజమానులు, ట్రాక్టర్ యజమానులు, ఆటో యజమానులు, టూ వీలర్స్ యజమానులు, ఇతరత్రా వారు కూడా సహకరించాలని వారు కోరారు, స్పందించిన గ్రామస్తులు సమయం తీసుకొని వచ్చే నెల పదో తారీకు లోపు మా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు సంతోషించారు. గ్రామంలో సిసి రోడ్ల పైన వాహనాలు మరియు పశువులు కట్టే దని తెలిపారు. మీ గ్రామం కోసం పని చేస్తున్నా సర్పంచ్ మరియు సిబ్బంది లను ఈ విషయంలో వ్యతిరేకిస్తే వారు మాకు తెలియజేసినట్లు అయితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవరాజు, ఆటో యూనియన్ అధ్యక్షుడు ఆకు దారి సడవలి, ట్రాక్టర్ యజమానులు, కిరాణం యజమానులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News