Thursday, 30 July 2026 10:47:18 PM

వృద్ధులకు వైద్యం, ప్రయాణాలలో రాయితీలు కల్పించాలి..

Date : 30 January 2025 05:21 PM Views : 471

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సీనియర్ సిటిజన్లకు ప్రస్తుతం ఉన్న టికెట్ రాయితీని రైల్వే శాఖ రద్దుచేసింది. కేవలం కింది బెర్త్ మాత్రమే కేటాయిస్తోంది. జనరల్ టికెట్ మినహా స్లీపర్, ఆపై తరగతులకు కనీసం కొంత శాతాన్ని ఇవ్వడం సీనియర్ సిటిజన్లను గౌరవించడమే.కాని 60-70 ఏళ్ల వాళ్ల ప్రయాణాలు తక్కువ ఉంటాయి. 70 దాటితే అవి చాలా అరుదు. వయస్సు మీరిన వారి వల్ల ఉత్పాదక ఉండదనే ఆలోచన సరైనది కాదు. పెన్షనర్లు ప్రభుత్వ సర్వీసులో ఉన్నప్పుడు అన్ని పన్నులు ప్రభుత్వానికి చెల్లించారు. ఇప్పుడు ఆరోగ్య బీమా వంటి పన్నులు చెల్లిస్తున్నారు. ఈ స్థితిలో పెన్షన్ అన్ని అవసరాలకు సరిపోదు. ఈ పరిస్థితులను ప్రభుత్వం వాస్తవ దృష్టితో చూసి, తగిన రక్షణ కల్పించడం భావ్యం. వృద్ధులకు వీలైనంత వరకు వైద్యం, ప్రయాణాలలో ఏదో విధమైన రాయితీ అత్యవసరం.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :