Saturday, 13 June 2026 01:22:42 PM

సమస్య పరిష్కారం కోసమే అఖిలపక్ష కమిటీ..

విలేకరుల సమావేశంలో అఖిలపక్ష కమిటీ ప్రతినిధులు

Date : 15 October 2022 06:00 PM Views : 511

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు దీపావళి పండుగలోపు డబ్బులు ఇచ్చేందుకు ఆర్ ఎఫ్ సి ఎల్ సబ్ కాంట్రాక్టర్లు అంగీకరించినట్లు అఖిలపక్షం కమిటీ తెలిపింది. శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ ప్రతినిధులు గుమ్మడి కుమారస్వామి కే .రాజన్న ,వై. యాకయ్య తెలిపారు. శుక్రవారం సబ్ కాంట్రాక్టర్లతో ఆర్ ఎఫ్ సి ఎల్ బాధ్యులకు సంబంధించిన సమస్యలపై చర్చించినట్లు పేర్కొన్నారు. మోహన్ గౌడ్ కు సంబంధించి 140 మంది, ఉపెందర్ 98, సంబంధించి 125 మంది నుండి డబ్బులు తీసుకున్నట్లు తమకు చెప్పారని పేర్కొన్నారు. వీరందరికీ సంబంధించి 16 నుంచి 17 కోట్ల వరకు వసూలు చేసినట్లు చెప్పారన్నారు. ఐదు కోట్ల వరకు మర్చిపోగా మిగిలిన మొత్తాన్ని బాధితులకు ఇచ్చేందుకు అంగీకరించారన్నారు. పాత అసోసియేషన్ సంబంధించిన వారు తమతో విభేస్తున్నట్లు పేర్కొన్నారు.సుమారు 84 మంది దళారులు ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నట్లు తమ వద్ద సమాచారం ఉన్నదని అవసరం వచ్చిన సందర్భంలో అన్ని పేర్లు బయటపెడతామని పేర్కొన్నారు. స్టార్ కాంటాక్ట్ కంపెనీ తీసుకొన్నా డబ్బులు కూడా వసూలు చేసేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు న్యాయం చేసేందుకు ఏర్పడిన అఖిలపక్షం కమిటీగా కొన్ని విజయాలు సాధించామన్నారు. కాంట్రాక్టర్ మారినప్పటికీ ఉద్యోగం కొనసాగేలా ఉద్యోగ భద్రత కల్పిస్తున్నట్లు యాజమాన్యం అంగీకరించిందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.25వేలు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులు ఎవరు అధైర్య పడవద్దని, గందరగోళానికి గురి కావద్దని విజ్ఞప్తి చేశారు.ఈ విలేకరుల సమావేశంలో కమిటీ ప్రతినిధులు వేల్పుల కుమారస్వామి,ఈ. నరేష్,ఉల్లి మొగిలి పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :