Thursday, 30 July 2026 09:55:09 PM

కార్పోరేషన్ విధులను పకడ్బందీగా నిర్వహించాలి... రామగుండం కార్పొరేషన్ పని తీరు పై సమీక్షించిన జిల్లా కలెక్టర్...

మార్చి చివరి నాటికి పూర్తి స్థాయిలో ఆస్తిపన్ను వసూలు చేయాలి... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష..

Date : 30 January 2025 08:03 PM Views : 481

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : రామగుండం కార్పొరేషన్ విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ రామగుండం పురపాలక కార్యాలయంలో కార్పొరేషన్ పనితీరుపై పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టి.యూ.ఎఫ్.ఐ.డి.సి) నిధుల ద్వారా చేపట్టిన నగరాభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, ఆస్తి పన్ను వసూలు, టౌన్ ప్లానింగ్, తదితర అంశాలను కలెక్టర్ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ నగరంలో టి.యూ.ఎఫ్.ఐ.డి.సి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, వరద నియంత్రణ పనులకు ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చే వర్షాకాలం నాటికి పూర్తయ్యే విధంగా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఆస్తి పన్ను రాబోయే 2 నెలల కాలంలో మార్చి చివరి నాటికి వసూలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పారిశుధ్య నిర్వహణ కోసం నూతనంగా కొనుగోలు చేసిన ఆటోలు, ట్రాక్టర్ లు పూర్తి స్థాయిలో వినియోగించాలని, నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, చెత్త సేకరణ సంబంధించి నిర్దేశిత షెడ్యూల్ ఫాలో కావాలని , రోడ్లపై ఎక్కడ చెత్త లేకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్పొరేషన్లు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అనుమతి లేకుండా ఎక్కడైనా నిర్మాణాలు జరిగితే వెంటనే తొలగించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ శాంతి నగర్ లోని సెంటర్ డ్రై రీసెర్చ్ సెంటర్ , మేడిపల్లి డంప్ యార్డ్ ను పరిశీలించారు.ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రామలింగు, ఎస్ఈ శివానందం, ఈఈ రామణ్, ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :