ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : రామగుండం నియోజకవర్గంలో స్వార్ధ రాజకీయాలకు తెర పడిందని మున్సిపల్ కార్పొరేటర్ దాతు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత పాలకుడు చేసిన నిర్లక్ష్యం వల్లే రాష్టానికి అన్యాయం జరిగి దివాలా తీసిందని ఆరోపించారు. రామగుండం అభివృద్ధి చెందక పోవడంతో ఇక్కడి వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారని అన్నారు. రానున్న కాలంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ నాయకత్వంలో రామగుండం కార్పొరేషన్ కు పూర్వ వైభవం తీసుకువచ్చి అవినీతికి తావు లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గత పాలకుడు చేసిన నిర్లక్ష్యం వల్ల రామగుండం అభివృద్ధి చెందక తన చేతకాని నిర్లక్ష్యం వల్లే నియోజకవర్గ నిధులు ఇతర జిల్లాలకు తరలి వెళ్లాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తన సొంత అవసరాల కోసం నియోజకవర్గంలో అభివృద్ధి చేయకుండా స్వార్థం చూసుకున్నారని విమర్శించారు. అలాగే పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ నాయకత్వంలో పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, దాని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News