Saturday, 13 June 2026 02:29:34 PM

మహిళ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలి..

హోమ్ మినిస్టర్ మహమూద్ అలీని కలిసిన రామగుండం ఎమ్మెల్యే చందర్

Date : 01 May 2023 05:59 PM Views : 611

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్ లో సోమవారం హోం మినిస్టర్ మహమూద్ అలీని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మర్యాద పూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మహిళా పోలీస్ స్టేషన్ ను త్వరగా ఏర్పాటు చేయాలని మహమూద్ అలీకి ఎమ్మెల్యే చందర్ విన్నవించారు. ఈ విషయమై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే చందర్ తెలిపారు. ఎమ్మెల్యే వెంట టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య తదితరులున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :