Thursday, 30 July 2026 08:06:44 PM

ప్రపంచ స్థాయి అవార్డుకు ఎంపికైన ఎస్సీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ టి.అంజయ్య.

Date : 06 December 2024 11:08 AM Views : 595

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్‌కర్నూల్ జిల్లా : ప్రపంచ స్థాయిలో ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డుకు అచ్చంపేట ఎస్సీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ టి.అంజయ్య ఎన్నికయ్యారు. గ్లోబల్ స్కూల్ లీడర్స్,అంతర్జాతీయ సంస్థ, అమెరికా వారు ప్రపంచ స్థాయిలో, విద్యా వ్యవస్థలో పరిపాలన, పిల్లల శ్రద్ధ,ఆరోగ్యం ,చదువు ప్రతిభపాటవాల ను కనబరిచేందుకు కృషిచేసినందుకు ఉత్తమ ప్రతిభను కనబరిచిన ఐదు గురినీ ఎన్నిక చేయగా, వీరిలో నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట పట్టణంలోని ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్, టి అంజయ్య ను ఎన్నిక చేశారనీ పేర్కొన్నారు దీనితో పాటు 80వేలరూపాయల నగదును, ప్రశంసా పత్రాన్నిఅందజేస్తారని తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ టి.అంజయ్య మాట్లాడుతూ.. విద్యలో క్రమశిక్షణ, పాఠ శాలలో పరిశుభ్రత,అకాడమిక్ ఎక్సలెన్స్ అనే అంశాల ఆధారంగా ఎంపిక చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల నుండి కాంటెస్ట్ చేయగా భారతదేశం నుండి తనను సెలెక్ట్ చేశారని, తన సర్వీసులో రెండుసార్లు రాష్ట్రవ్యాప్త ఉత్తమ ప్రిన్సిపల్ గా అవార్డు అందుకున్నానని అన్నారు. 30సంవత్సరాల సర్వీసులో విద్యార్థుల విద్య, ఆరోగ్యం, క్రీడలు, పరిశుభ్రత, మనోవికాసంలే ప్రామాణికంగా తీసుకొని విద్యార్థులను సమాజానికి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమేతన లక్ష్యమని ఉన్నతాధికారుల తోడ్పాటుతో పాఠశాల బోధనా సిబ్బంది సహకారాలతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తానని తెలిపారు.ఈఅవార్డును ఈనెల 11వ తేదీన ప్రధానంచేయనున్నారని అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :