ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సై- కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షల ఫలితాలలో అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగిందని,తప్పుగా వచ్చిన కానిస్టేబుల్ ప్రశ్నపత్రం లో 22,ఎస్ఐ ప్రశ్నపత్రంలో 7 కు తప్పిద మార్కులను కలపకుండానే ఫలితాలు వెల్లడించారని AIYF జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య పేర్కొన్నారు.తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్(TSLPRB)ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో దగ్దం చేస్తుంటే పోలీస్ లు లాక్కోవడంతో AIYF కార్యకర్తలు అక్కడే బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా AIYF జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపురి సూర్య మాట్లడుతూ.. ఎస్సై- కానిస్టేబుల్ ప్రిలిమినరీ కటాఫ్ మార్కులలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.తప్పుడు ప్రశ్నలతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని,తప్పుగా ఇచ్చిన 22 ప్రశ్నలకు.. 22 మార్కులు ఇవ్వాలని,క్వాలిఫై మార్కులు వచ్చినప్పటికీ ఎస్సి, ఎస్టీ, బీసీ అభ్యర్థులను లిస్ట్ లో పెట్టలేదని,ప్రతి అభ్యర్థి మార్క్ లిస్ట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 7 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై అభ్యర్థులు అనేక రోజులుగా ఉన్నాతాధికారుల చుట్టూ తిరుగుతున్నా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్ రావు పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలో క్వాలిఫై మార్కులు వచ్చినా లిస్టులో పేర్లు లేవని, ఈఘటనలతో ఇప్పటికే 8 మంది అభ్యర్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. 6 లక్షల 3 వేల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు పరీక్షలు రాస్తే బోర్డు తప్పిదం వలన లక్షా 90 వేల మంది మాత్రమే క్వాలి ఫై అయ్యారని, 2 లక్షల 50 మంది ఎస్సై పరీక్ష రాస్తే 1 లక్ష 5 వేల మంది క్వాలి ఫై అయ్యారని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులు, నిరుద్యోగులు నేడు స్వరాష్ట్రంలో కూడా న్యాయం కోసం ఆత్మహత్యలు చేసుకోవడం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. అభ్యర్థులకు అసెంబ్లీ సాక్షిగా న్యాయం చేస్తామని చేసిన ప్రకటనను, ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలని ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో లక్షలాది మంది అభ్యర్థులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AIYF జిల్లా ఉపాధ్యక్షులు వనపకల విజయ్, రణవెని సుధీర్ కుమార్, భుసరపు రాజు, అసాల నవీన్, మాతంగి కుమార్, సురేష్, చింటు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News