Saturday, 13 June 2026 02:41:10 PM

డ్రగ్స్ కేసులో ఇరికించడానికి ముఖ్యమంత్రి ప్రయత్నించారు...

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు....

Date : 29 October 2024 05:41 PM Views : 428

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నించారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... నేను నా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫంక్షన్ కు వెళ్తున్నానన్న విషయం నాకు తప్ప ఎవరికీ తెలియదని అన్నారు. అయితే ఫంక్షన్‌కి వెళ్లడానికి ముందు తన ఫోన్ ట్యాప్ చేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సోషల్ మీడియా వారియర్స్ ఫోన్ లను సైతం ట్యాపింగ్ చేస్తున్నారన్నారు. అయితే ఫంక్షన్ కి వెళ్లే సమయంలో కొంత మంది పోలీసులు వచ్చి తన కారును ఆపి డ్రగ్స్ పెట్టి తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. అసలు నాకు మందు తాగే అలావాటు కూడా లేదని.. అలాంటిది ఏకంగా డ్రగ్స్ కేసులోనే ఇరికించే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :