Thursday, 30 July 2026 09:55:02 PM

ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిని ఖండించిన బిజెపి నాయకులు

Date : 19 November 2022 08:31 PM Views : 479

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటిపై టి.ఆర్.యస్. పార్టీ గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, బి.జె.పి. ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మొహానికి నల్ల రిబ్బన్ లు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి.జె.పి. రాష్ట్ర నాయకులు కౌశికహరి పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో టి.ఆర్.యస్. పార్టీ అరాచకాలు మితిమీరి పోతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంట్ సభ్యుని ఇంటిపై దాడి చేస్తూంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి పక్షాలు ఏదైనా నిరసన కార్యక్రమాలు చేపిస్తే వెంటనే వచ్చే పోలీసులు ఎంపీ ఇంటిపై దాడి చేస్తుంటే కనీసం స్పందించలేదని అన్నారు. ఆసలు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు చేస్తూ, అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కె.సి.ఆర్. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. బి.జె.పి. నాయకుల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టి.ఆర్. యస్. నాయకులను ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి.జె.పి. సీనియర్ నాయకులు మామిడి రాజేష్, మహావాది రామన్న, ముకిరి రాజు, గోగుల రవీందర్ రెడ్డి, సులువ లక్ష్మినర్సయ్య, పొన్నం శశికుమార్, మామిడి సంపత్, గోపగోని నవీన్ గౌడ్, బూడిద రమేష్, బండి రాము, వడ్డెపల్లి సదానందం, సాడవేన రాజు, కళ్యాణ్, సాయిలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :