Friday, 31 July 2026 11:37:48 PM

బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేకుండా కాంగ్రెస్–బీజేపీ డ్రామాలు చేస్తున్నాయ్... కల్వకుంట్ల కవిత

ఖైరతాబాద్ చౌరస్తాలో బీసీ బంద్‌కు మద్దతుగా జాగృతి మానవహారం...

Date : 18 October 2025 01:22 PM Views : 581

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు చేపట్టిన బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా వద్ద మానవహారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు, జాగృతి కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.బీసీల హక్కుల సాధన కోసం రాష్ట్రం వ్యాప్తంగా ఉధృతంగా కొనసాగుతున్న ఈ ఉద్యమానికి జాగృతి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ....బీసీ బిడ్డలు తమ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు. అయితే, వారికే రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పార్టీలు బంద్‌కు మద్దతు పేరుతో నాటకాలు ఆడుతున్నాయని ఇది అసలు హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేయాల్సిన బీజేపీ ఇద్దరూ కలిసి బంద్‌కు మద్దతు పేరుతో ప్రజల కళ్లలో పొగలు కక్కుతున్నారని విమర్శించారు. హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లుగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా ఆరోపించారు..బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు.స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి బీసీలను వివిధ రూపాల్లో మోసం చేశారని. తెలంగాణ ఉద్యమం ఎలా ప్రజల మనసును గెలుచుకుందో, అదే విధంగా బీసీ హక్కుల కోసం మరో మహా ఉద్యమాన్ని జాగృతి ప్రారంభించబోతోందని అన్నారు. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలని కవిత స్పష్టం చేశారు.బీసీ బంద్ విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అలాగే రిజర్వేషన్లు సాధించేందుకు ప్రభుత్వం సరైన టెక్నికల్ వాదనలు వినిపించడం లేదని. అందుకే సుప్రీంకోర్టులో తీర్పులు బీసీలకు వ్యతిరేకంగా వస్తున్నాయని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ పాలనలో జనగణనను నిర్వహించకపోవడం వల్లే రిజర్వేషన్ల అమలు నిలిచిపోయిందని జీవో 9 విషయంలో కూడా కాంగ్రెస్ చిత్తశుద్ధిగా వ్యవహరించలేదని అందుకే కోర్టు ఆ జీవోను కొట్టివేసిందని తెలిపారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఎవరికీ చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.ఇప్పుడే ఎన్నికలు నిర్వహించాల్సినంత తొందర ఏముంది? మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికలు 5 సంవత్సరాలు వాయిదా పడ్డ సందర్భాలు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రజాస్వామ్య విధానంలో ఇది న్యాయమైన అభ్యర్థన అని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెడుతోందని ప్రజాప్రతినిధులను గౌరవించని ప్రభుత్వం ఎప్పటికీ నిలవదని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీసీల రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని. చిత్తశుద్ధి ఉన్న పార్టీలు మాటలతో కాక, చట్టాలతో నిరూపించాలని. బీసీ బిడ్డల భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. జాగృతి కార్యకర్తలు బీసీ ఉద్యమ పతాకాలను ఊపుతూ తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.ఈ మానవహారం కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర సమన్వయకర్తలు, యూపీఎఫ్ నాయకులు, మహిళా కార్యకర్తలు, విద్యార్థి విభాగ సభ్యులు పాల్గొని బీసీ బంద్ విజయవంతం కావాలని పిలుపునిచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :