ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ప్రజలను మోసం చేస్తున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, మహంకాళి స్వామిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... సింగరేణి నిధులతో ఏర్పాటైన మెడికల్ కాలేజీకి సింగరేణి మెడికల్ కాలేజ్ అని పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. అంతే కాకుండా మెడికల్ కాలేజీలో 25 శాతం సింగరేణి కార్మికులకు 5 శాతం స్థానికులకు కేటాయించాలన్నారు. రామగుండం నియోజకవర్గంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని కార్మికులు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే చిన్న చిన్న వర్షాలకి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని అన్నారు. 2019 నుండి ఇప్పటివరకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్ని నిధులు తీసుకోవచ్చరో చెప్పాలని దీనిపై బహిరంగ చర్చ కైనా సిద్ధమని వారు సవాల్ విసిరారు. ఐటీ కంపెనీ పేరుతో అమెరికాకు వెళ్ళిన ఎమ్మెల్యే రామగుండానికి ఏఐటి కంపెనీ తీసుకోవచ్చారో పేరు చెప్పాలన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు.ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దాని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News