ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటనలు చేస్తున్న దానిని కొందరు అధికారులు తుంగలో తొక్కుతూ ప్రవేట్ ఆసుపత్రి సిబ్బందితో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో నడుస్తున్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహమే కారణమం అనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పెద్దపల్లి కునారం క్రాస్ రోడ్ వద్ద గతంలో నడిచిన ఓ ఆస్పత్రి మూతపడింది.. దాని స్థానంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఎంబిబిఎస్ గా చలామణి అవుతూ ముందు వైపు హాస్పిటల్ మూసివేసి వెనుక వైపు నుంచి హాస్పిటల్ నడిపిస్తున్న ఘటన పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంటున్న దీనిపై సంబంధిత అధికారులకు సమాచారం లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై సంబంధిత అధికారిని ఫోన్ లైన్ లో వివరణ కోరగా.. సంబంధిత ఆసుపత్రికి అనుమతి లేదని గతంలోనే ఆసుపత్రి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని వారికి ఇంకా పూర్తిస్థాయిలో అనుమతి రాలేదని వివరణ ఇచ్చారు... అంత బహిరంగంగా ఆసుపత్రి నిర్వహిస్తున్న సంబంధిత వారిపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Admin
Aakanksha News