Thursday, 30 July 2026 12:13:41 PM

ఆదాయపు పన్ను శాఖ అధికారి ఆత్మహత్య....

Date : 05 April 2025 07:12 PM Views : 735

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : హైదరాబాద్ లోని సీజీఓ టవర్స్ పైనుంచి దూకి ఆదాయం పన్ను శాఖ అధికారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఆదాయపు పన్ను శాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న విజయలక్ష్మి (52)లు సీజీఓ టవర్స్ పై నుండి దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై స్థానికులు గాంధీనగర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీ నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :