Saturday, 13 June 2026 02:39:23 PM

పద్మశాలీ సోదరులు త్యాగంలో ఎప్పుడూ ముందుంటారు...

ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీగా నామకరణ ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Date : 09 March 2025 05:34 PM Views : 549

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : పద్మశాలీ సోదరులు త్యాగంలో ఎప్పుడూ ముందుంటారనీ, వారి త్యాగాలు మరువలేనివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అఖిల భారత పద్మశాలి మహాసభ జరుగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ తన సొంత ఇంటినే ఇచ్చేశారని, ఆయన పదవిని త్యాగం చేశారని గుర్తు చేశారు. ఏ అవకాశం వచ్చినా పద్మశాలి సోదరులకు న్యాయం చేయడమే ప్రభుత్వ విధానం అని అన్నారు. అలాగే ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని ఈ వేదికగా ప్రకటిస్తున్నాం అని అన్నారు. ఆ బాధ్యతను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకి అప్పగిస్తున్నామని తెలిపారు. అంతే కాకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కుట్ర జరుగుతోందని... ఈ కుట్రలను బీసీ సమాజం తిప్పికొట్టాలని అన్నారు. ఇతర రాష్ట్రాల ఎన్నికలలోనూ ఇక్కడి పద్మశాలీలు కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.. కోటి రూపాయలతో షోలాపూర్ లో పద్మశాలీ ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తాం అని ఆర్ధికంగా రాజకీయంగా, ఉపాధి, ఉద్యోగ పరంగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.మీ కోసం క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ సోదరుడిగా అండగా ఉంటానని ఈ వేదికగా హామీ ఇస్తున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :