ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ ధర్మపురి ఎంపీ అరవింద్ ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చడంపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా ""అయ్యయ్యో.. ఇప్పుడు ఎలెక్షన్లల నా మీద ఎవరు వెంటాడి, వేటాడి నిలవడతరు’’అంటూ కామెంట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తుంది. ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్తే ఎన్నికల్లో తనమీద ఎవరు పోటీచేస్తారనే అర్ధం వచ్చేలా ఆయన ట్వీట్ చేయడం పట్ల అందరిలో ఆసక్తిని నెలకొల్పుతుంది.
Admin
Aakanksha News