Thursday, 30 July 2026 08:44:29 AM

ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు

Date : 08 July 2023 04:03 PM Views : 767

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని చౌరస్తాలో దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కీ.శే డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నజీమ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కౌటం సతీష్ అధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు యం ఎస్ రాజ్ ఠాకూర్ హాజరై చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మహనీయుడు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను, ఏంతో మంది విధ్యార్థుల భవిష్యత్తుకీ బాట వేసిన గొప్ప నాయకుడని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు వెన్నంటు ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని దేశంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా ప్రజలందరూ కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :