ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : SCCWU IFTU ఆధ్వర్యంలో అర్జీ -1 డివిజన్ లోని వివిధ సెక్షన్లలో సమావేశాలను నిర్వహించారు.ఈ కార్యక్రమాలకు SCCWU IFTU రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తోకల రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.18 రోజుల సుదీర్ఘ సమ్మె చేసిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులపై సింగరేణి యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. నేటికీ సెప్టెంబర్ నెలలో చేసిన డ్యూటీలకు సైతం అక్టోబర్ నెలలో చెల్లించలేదని వీరికి రావాల్సిన 17 నెలల ఏరియార్స్ ని ఇవ్వడంలో కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. దసరా పండుగ పూట కాంట్రాక్టు కార్మికులను పస్తులు ఉంచే విధంగా కనీసం వేతనాలు కూడా చెల్లించలేదని సింగరేణి యాజమాన్యం ఇదే పద్ధతులు అనుసరిస్తే కార్మికుల నుంచి ప్రతిఘటన వస్తుందని తెలిపారు. ప్రతి నెల 7వ తారీకు వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన సర్కులర్ ను అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు చెల్లించాల్సిన 17 నెలల బకాయిలను వెంటనే చెల్లించి సింగరేణి యాజమాన్యం చిత్తశుద్ధిని నిరూపించు కోవాలని అన్నారు. లేనట్లయితే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులందరికీ మళ్లీ ఐక్యం చేసి పోరాటానికి సిద్ధం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో SCCWU IFTU రామగుండం రీజియన్ ప్రధాన కార్యదర్శి కోండ్రమొగిలి, ఆర్జీవన్ అధ్యక్షులు కొయ్యడ శంకర్, రామగుండం రీజియన్ కోశాధికారి నేరెళ్ల రాజేందర్, మాట్ల సమ్మయ్య, శనిగరపు కృష్ణ, కొయ్యడ సురేష్, చిన్నయ్య, కిష్టయ్య, వెంకటేష్ శివశంకర్, గాజుల రమేష్, గంగుల వెంకటేష్, భూదారపు సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News