Friday, 31 July 2026 06:40:59 PM

సేవ సంకల్పం.... స్ఫూర్తిదాయకం

Date : 25 November 2022 02:56 PM Views : 777

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : నిస్సహయులకు సహయం అందించటం స్పూర్తిదాయకంగా ఉంటుందని...గోదావరిఖని వన్ టౌన్ సీఐలు రమేష్ బాబు, ప్రసాద్ రావు అన్నారు. గోదావరిఖని ఏసీపీ ఎస్.గిరి ప్రసాద్- రత్న కుమారి దంపతుల వివాహ దినొత్సవాన్ని పురష్కరించుకొని జ్యొతి గాంధీ పౌండేషన్ నిర్వహణలో స్థానిక గోదావరిఖని సంజయ్ నగర్ లోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలోని నలబై మంది విద్యార్థులకు "పాకెట్ మనీ" అందించారు.ఈ సందర్బంగా సీఐ లు మాట్లాడుతూ...సేవ సంకల్పం...సేవ గుణం సమాజంలో మంచిని‌ పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. అనంతరం వివాహ వేడుక కేక్ ను పాఠశాల విద్యార్థులు కట్ చేశారు.ఈ కార్యక్రమంలో రామగుండం నగర పాలక కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్వినీ, పెద్దెల్లి ప్రకాష్, పౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ, పలు పక్షాల బాధ్యులు అన్న పూర్ణ,జ్యొతి, హేమ సుందర్ మధు తదితరులు ఉన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :