Thursday, 30 July 2026 10:15:45 AM

మాజీ సీఎం జగన్ ప్రభాస్‌ తో నాకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేయించారు...

సంచలన ఆరోపణలు చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

Date : 22 November 2024 01:22 PM Views : 592

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నాకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేయించారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ... అసలు ప్రభాస్ ఎవరో నాకు తెలియదని, నాకు ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేసి చెప్పానని అన్నారు. ఒకవేళ జగన్ కు నాపై ప్రేమ ఉంటే ప్రచారం జరుగుతున్నప్పుడు గాడిదలు కాశావా అని మండిపడ్డారు. జగన్ తన సైతాన్ సైన్యంతో తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్నారని అన్నారు. అలాగే జగన్‌ ఆంధ్రప్రదేశ్ పరువు తీశారంటూ షర్మిల మండిపడ్డారు.ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌కు పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందన్నారు. ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్‌ రాష్ట్రం పరువు తీశారని ఆక్షేపించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :