Friday, 31 July 2026 08:39:16 PM

కార్మికుల హక్కులను కాలారస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం... ప్రశ్నించే గొంతుకను నొక్కలేరు...

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, కోరుకంటి చందర్

Date : 04 October 2024 12:41 PM Views : 778

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణి కార్మికుల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలారస్తుందని రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదావరిఖని చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...గత నెల సింగరేణి లాభాల వాటాను ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనే స్వయంగా ప్రకటించారని అన్నారు. ఆ ప్రకటించిన లాభాల వాటా నుండే 33 శాతం సింగరేణి కార్మికులకు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే జీర్ణించుకొలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, టీబీజీకేఎస్ కార్మిక సంఘం నాయకుల మీద తప్పుడు ప్రచారాలను చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించే లాభాల వాటతో కార్మికులు ఎంతో నష్ట పోతున్నారని అన్నారు. కార్మికులకు న్యాయం చేయాలనీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో ఈ నెల 6వ తేదీన ఒక్కరోజు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. అయితే వచ్చిన లాభాలను కార్మికులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే కించపరిచే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు.ఈ నెల 9వ తేదీన 33 శాతం లాభాల వాటాను బేషరత్తుగా సింగరేణి కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.లాభల వాటపై ప్రశ్నించే సకలజనుల గొంతులను నొక్కలేరని హెచ్చరించారు. సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని కార్మికుల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :