Thursday, 30 July 2026 01:15:49 PM

మేం గేట్లు తెరిస్తే కాంగ్రెస్‌ పార్టీ లో ఎవరు మిగులరు....

కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

Date : 04 January 2024 09:23 PM Views : 567

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు అని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేసీఆర్‌ నాయకత్వంలో పని చేసేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడిమా సమావేశంలో మాట్లాడారు.కాంగ్రెస్‌ పార్టీ నుంచే బీఆర్‌ఎస్‌లోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. వాళ్లు ఒక్కరిని తీసుకెళ్తే బీఆర్‌ఎస్‌లోకి పది మంది వస్తారని పేర్కొన్నారు. మేం గేట్లు తెరిస్తే చాలా మంది కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతారని చెప్పారు. మేం బీఆర్‌ఎస్‌ పార్టీని సంస్థాగతంగా చేయడంపై చర్చిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు ఉన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :