ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఆటో నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో భార్య ఇద్దరు పిల్లలతో కలసి సంతోషంగా జీవిస్తున్న క్రమంలో విధి ఆడిన వింత నాటకంలో ఓ ఆటో డ్రైవర్ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.అయితే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేక ఓ ఆటో డ్రైవర్ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా ముందుకు వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.గోదావరిఖని రామగుండం కార్పొరేషన్ లోని 12వ డివిజన్ కు చెందిన బీర విజయ్ ఇటీవలే జరిగిన ఆటో ప్రమాదంలో పక్కటేముకలు, నడుము,ఎముకలు విరగడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. దీంతో డాక్టర్ లు ఆపరేషన్ కు ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో వారి దగ్గర లక్షల రూపాయలు పెట్టి చికిత్స చేయించుకునే స్తోమత లేకపోవడంతో తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అప్పటినుండి చిన్నాచితక పనులు చేసుకుంటూ ఉండగా వచ్చిన డబ్బులు మొత్తం మందులకే ఖర్చు అవుతూ ఉండడంతో కనీసం తినడానికి బియ్యం, ఇంట్లో నిత్యవసర వస్తువులు కూడా లేకపోవడంతో పూట గడవలేని పరిస్థితిలో ఉన్నామని తమ కుటుంబాన్ని ఎవరైనా ఆదుకోవాలని కన్నీటి పర్యంతమవుతున్నారు.వీరికి ఉన్న ఆటో కూడా పూర్తిగా దెబ్బ తినడంతో చాలా ఇబ్బందుల్లో ఉన్న ఈ కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న 12వ డివిజన్ కార్పొరేటర్ BRS పార్టీ పట్టణ అధ్యక్షులు బొడ్డు రజిత రవీందర్ వెంటనే స్పందించి వారి ఇంటికి వెళ్లి పరామర్శించి నిత్యావసర సరుకులను అందజేశారు. కనీసం నిత్యావసర సరుకులు కూడా లేని పరిస్థితిలో ఉన్న వారి దయనీయ స్థితినీ చూసి చలించి పోయారు.వీరి పరిస్థితిని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ దృష్టికి తీసుకెళ్లి ఆపరేషన్ కు అయ్యే ఖర్చు LOC ద్వారా సమకూర్చి కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసాను ఇచ్చారు. అలాగే ఎవరైనా దాతలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని భార్య శారద కోరారు. పేరు : బీర శారద A/c : 62378433546 Sbi. Bank. విఠల్ నగర్. బ్రాంచ్, Ifsc Code : SBIN0020956. కు ఆర్ధిక సహాయం అందించగలరని కోరారు.
Admin
Aakanksha News