ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్‌కర్నూల్ జిల్లా : హైదరాబాద్ లో మీడియా జర్నలిస్టులపై సినీ యాక్టర్ మంచు మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ టీయూడబ్ల్యూజే (ఐజేయు) నాగర్ కర్నూల్ డివిజన్ ఆధ్వర్యంలో ఎస్పీకి మెమోరాండంను సమర్పించారు. ఈ సందర్బంగా పలువురు బాద్యులు మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రజా సమస్యల కోసం పని చేస్తున్న మీడియా జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని వారు అభివర్ణించారు.వర్కింగ్ జర్నలిస్టులపై ఎవరు దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సినీ నటుడు మోహన్ బాబుపై చట్ట రీత్యా చర్యలను తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు ఎస్పీకి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. ఈ కార్య క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా డివిజన్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News