ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కామారెడ్డి జిల్లా : పెళ్లికి ఇరువురి తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోరని క్షణికావేశంలో ప్రేమ జంట ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కొనాపూర్ లో చోటు చేసుకుంది. వివరల్లోకి వెళ్తే...తమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోరని గ్రామానికి చెందిన సాయికుమార్ , వీణా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలానికి బిబిపేట్ పోలీసులు వెళ్లి ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకుంటున్నారు.
Admin
Aakanksha News