ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ములుగు జిల్లా : ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ బాటిళ్లతో దళితబంధుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని దళితబంధు లబ్ధిదారులు నిరసన తెలుపుతూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Admin
Aakanksha News