Thursday, 30 July 2026 12:14:07 PM

లక్ష లో అధికార చేతివాటం...⁉️

Date : 12 August 2023 02:42 PM Views : 1274

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తుంటే ఓ నాయకుడు మాత్రం ముఖ్యమంత్రి ఆదేశాలను తుంగలో తొక్కుతూ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బీసీ లోన్ లను మంజూరు చేయిస్తానంటూ రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు దరఖాస్తు చేసుకున్న ప్రజల వివరాలను సేకరించి తనకు 10వేల రూపాయలు కమిషన్ ఇస్తే లక్ష రూపాయల లోన్ మంజూరు చేయిస్తానంటూ సదరు నాయకుడు చేతివటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సైతం సదరు నాయకుడు కాంట్రాక్టుల విషయంలో కొంత మందికి డబ్బులను ఇవ్వకుండా మోసం చేశాడనే విమర్శలు ఉన్నాయి. సదురు నాయకుడిపై గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ముఖ్య నాయకులు పట్టించుకోకపోవడం పట్ల ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే రామగుండం నియోజకవర్గంలో ఆర్ ఎఫ్ సీ ఎల్ కుంభకోణంతో పాటు బూడిద, ఉద్యోగ దందాలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందంటూ ఒక అపవాదను మూటకట్టుకున్న నేపథ్యంలో లోన్ ల విషయంలో మరో కమిషన్ దందాకు తెర తీయడంతో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. రానున్న రోజుల్లో ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందో, ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :