Friday, 31 July 2026 02:14:34 PM

హత్య కేసులో నిందితుడి అరెస్టు...

Date : 21 September 2024 07:00 PM Views : 942

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి పట్టణంలోని కొత్తపల్లి గ్రామానికి వెళ్లే రహదారి వద్ద ఈ నెల 19వ తేదీన జరిగిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి రాజేశం హత్య కేసులో A1 నిందితుడిని అరెస్టు చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ మీడియాకు వివరాలను వెల్లడించారు. గత 15 సంవత్సరాల నుంచి పొలం భూముల సరిహద్దు విషయంలో ఇంటిదగ్గర భూముల సరిహద్దు విషయంలో వివాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇదే విషయంపై పెద్దమనుషుల సమక్షంలో చాలాసార్లు పంచాయతీలు కూడా జరిగాయని భూముల విషయంలో పోలీస్ స్టేషన్, కోర్టులో కేసులు నడుస్తున్నాయని వీటి నుండి తప్పించుకోవడానికి హతమార్చాలని పథకం ప్రకారం మాట విసి హత్య చేశారని తెలిపారు.అయితే నిందితుడు లక్ష్మయ్య 19వ తేదీన పెద్దపల్లి ది తన తల్లికి మందులు తీసుక రావడానికి వెళ్తున్న సమయంలో మృతుడు రాజేశం భూమిని కొలుస్తు ఉండటాన్ని గమనించి వెంటనే తన అన్నదమ్ములైన లక్ష్మయ్య, మల్లయ్య, రాజయ్యలకు సమాచారాన్ని అందించాడు.దీంతో అక్కడికి చేరుకున్న ముగ్గురు రాజేశంతో వాగ్వాదానికి దిగారు. మృతుడు రాజేశం పొలం దగ్గర నుండి తన మోటార్ సైకిల్ వైపు నడుచుకుంటు వస్తుండగా వెనుక వైపు నుండి లక్ష్మయ్య మృతుడి తలపై కొట్టడంతో తన ద్విచక్ర వాహనం నుండి కింద పడిపోయాడు. వెంటనే అదే కరతో మల్లయ్య లక్ష్మయ్యలు పలుమార్లు కొట్టడంతో రాజేశం అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హత్య జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా నిందితుడు లక్ష్మయ్య తన ఇంటి వద్ద ఉన్నాడనే పక్కా సమాచారంతో సీఐ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకొని పంచుల సమక్షంలో విచారించగా నువ్వు వివాదాల నేపథ్యంలో హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకోవడంతో నిందితుడి రక్తపు మరకలు బట్టలు మోటార్ సైకిల్ హత్యకు ఉపయోగించిన కర్రలను పోలీసుల స్వాధీనం చేసుకున్నాట్లు పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :