Saturday, 13 June 2026 02:40:24 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలి గోటికి సరిపోవు....

కేటీఆర్ డ్రగ్స్ శాంపిల్ టెస్ట్ చేయించుకోవాలి...ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

Date : 31 October 2024 06:26 AM Views : 370

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోడని బీఆర్ఎస్ పార్టీ ఆంబోతు కౌశిక్ రెడ్డి అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఘాటుగా విమర్శించారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...కొకైన్ పాజిటివ్ ఎవరికి వచ్చింది పార్టీ ఎక్కడ జరిగింది ఎవరెవరు పార్టీలో ఉన్నారని చెప్పకుండా ఇష్యును ఎందుకు డైవర్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ ఫ్రెండ్స్ దగ్గర మిత్రులు డ్రగ్స్ తీసుకుంటారు.. కాబట్టి మాకు కేటీఆర్ మీద డ్రగ్స్ తీసుకుంటారని అనుమానం ఉంది దాన్ని నివృత్తి చేయడం లేదన్నారు. విజయ్ మద్దూరి మాకు దగ్గర అని కేటీఆర్ చెప్పారు.. విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్దారణ అయ్యింది కాబట్టి కేటీఆర్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. పదేండ్లు నేను చేసిన పనిని, ఉద్యమాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది.. ప్రజల సమస్యల మీద నేను పోరాటం చేసినందుకు అప్పటి మీ ప్రభుత్వం నా మీద 88 కేసులు పెట్టిందని ఇది నా చరిత్ర అని అన్నారు. నీ చరిత్ర ఎంటిదో నేను చెప్పాలా. నీకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని నీకు మద్దతు ఇచ్చింది బల్మూరి వెంకట్ అని అన్నారు. నీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 50వేల ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ విషయాలు లీక్ చేసావు.. నీకు ఎమ్మెల్సీ పదవీ ఎలా వచ్చింది ఇక్కడ విషయాలు అక్కడ లీకులు ఇచ్చినందుకు నీకు ఎమ్మెల్సీ పదవీ వచ్చింది తెలంగాణ ఉద్యమ కారుల మీద రాళ్ళు రువ్విన నీకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడ విన్న విషయాలు అన్నీ పక్క పార్టీకి లీక్ చేసిన వాడివి అంటూ మండిపడ్డారు.మీ పదేండ్ల పాలన మీద..మా పది నెలల పాలన మీద నేను చర్చకు రెడీ. కేటీఆర్ కు నిజంగా డ్రగ్స్ తీసుకోవడం అలవాటు లేకపోతే డ్రగ్స్ శాంపిల్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేసారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారా లేదా అనేది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అరేయ్ కౌశిక్ ముందు నియోజక వర్గ సమస్యలు ముందు పరిష్కారం చెయ్. మేము అపోలో హాప్సిటల్ కు వచ్చి శాంపిల్ ఇచ్చాము.. మీరు కూడా శాంపిల్ ఇవ్వండి రిపోర్ట్ జనాల ముందు బయట పెట్టండి. కౌశిక్ నోరు అదుపులో పెట్టుకో లేదంటే బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :