ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అనుమతి లేని అక్రమ కట్టడాలపై రామగుండం మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. ఎటువంటి అనుమతులు లేకుండానే వినాయక మండపాలను కట్టారని అందిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ మండపాలను కుల్చి వేయడంతో ఈ వివాదం చోటు చేసుకుంది.దీంతో కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. అయితే గోదావరిఖని గౌతమి నగర్ లో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వినాయక మండపాలపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కట్టడాలను కూల్చి వేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Admin
Aakanksha News